మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న 500 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ తెలిపింది. మొదటి విడతలో పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఎన్నికల్లో డీఎంకే హామీలో భాగంగా మద్యం విధానంలో కీలక మార్పులు చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 5329 రీటైల్ మద్యం దుకాణాలు ఉన్నాయి.