పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య (41 ఏళ్లు) లింగ మార్పిడి చేసుకోవాలని భావిస్తోంది. మహిళగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పురుషుడి లక్షణాలు ఉన్నాయి. దాంతో శారీరకంగా పురుషుడిలా మారడానికి లింగమార్పిడి చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైద్యులు సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. ఇది తన సొంత నిర్ణయమని, ఈ విషయంపై ఎవరూ రాద్ధాంతం చేయవద్దని సుచేతన స్పష్టం చేశారు.