కేంద్రంలోని మోడీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై రానున్నాయి. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ నడుం బిగించడంతో ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపై కాషాయ సర్కారుకు మంగళం పాడేందుకు సైద్దమయ్యారు. ఇప్పటికే సమావేశం తేదీ, వేడుక సిద్ధమయ్యాయి. ఇక సమైక్య శంఖారావం పూరించడమే మిగిలింది. ప్రతిపక్షాల ఈ ఐక్యత రాగం 2024 వరకు కోనసాగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.