సుమారు 20 మందిపై దాడి చేసిన మోస్ట్ వాంటెడ్ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. డ్రోన్ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో జరిగింది. ఓ కోతి గత 15 రోజుల్లో 20 మందిని గాయపర్చింది. స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కోతులను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. దాంతో ఈ కోతిని పట్టుకున్న వారికి రూ. 21 వేల బహుమతి ప్రకటించారు. ఉజ్జయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ నాలుగు గంటలు శ్రమించి కోతిని పట్టుకున్నారు.