బీహార్ నవాదా జిల్లాలోని నమ్ దర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ, 2, 8 ఏళ్ల వయసున్న తన కూతుళ్లను సజీవదహనం చేసింది. అనంతరం తానూ నిప్పంటించుకుంది. స్థానికులు సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం ఇంకా తెలియలేదని, అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.