ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను అమెరికా అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతీయ మూలాలున్న లక్షల మంది ఈ దేశంలో ఉన్నారని, వారిలో కొందరు ఈ సభలో గర్వంగా కూర్చున్నారని ఆయన తెలిపారు. అమెరికా కాంగ్రెస్లో ప్రధాని మోడీ దాదాపు గంట సేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విభిన్నమైన అంశాలపై ప్రస్తావించారు. మోడీ ప్రసంగంతో చాలా సార్లు కాంగ్రెస్ సభ్యులు నిలబడి చప్పట్లు కొట్టారు.