జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదని కేంద్ర టెలి కమ్యూనికేషన్, ఐటి శాఖ మంత్రి దేవ్ సిన్హా చౌహన్ తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో మీడియాతో మాట్లాడుతూ... మద్యం, వైన్స్ ఇన్కమ్ మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానమే అని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ప్రధాని మోడీ వివిధ పథకాలకు అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. బడ్జెట్లో ఆదాయం లేకున్నా నిధుల పంపకం లాంటి పంజాబ్ పరిస్థితులే కర్ణాటకలో రాబోతున్నాయని... ఏపీలో కూడా జగన్ పరిస్థితి అదే అని కేంద్రమంత్రి దేవ్సిన్హా పేర్కొన్నారు.