సఖినేటిపల్లి మండలం కేశవదాసు పాలెంకు చెందిన ఒక మహిళ గత సంవత్సరం రాజోలు సీఐ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. కొంతకాలానికి ఆమె భర్త కూడా మరణించడంతో వారి పిల్లల దీన స్థితిని చూసి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చలించిపోయారు. వారి స్థితిని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వారికి రూ 2 లక్షలు సీఎం సహాయనిధి మంజూరు అయింది. శనివారం సీఎం చేతుల మీదుగా ఆ చెక్కును అందించారు.