తిరుమల నడక మార్గంలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గంలో రాత్రి 7- 10 గంటల వరకు భక్తులను గుంపులు గుంపులుగా అధికారులు పంపిస్తున్నారు. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రత పెంచింది. నడక మార్గంలో వెళ్లే భక్తులకు పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. భక్తులు భజనలు, శబ్దాలు చేస్తూ వెళ్లాలని.. అలాగే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.