మణిపుర్లో త్వరలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయని ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ. తమ ప్రభుత్వం అక్కడ పరిస్థితులను చక్కదిద్దే పనిలో ఉందన్నారు. ఢిల్లీలో మణిపుర్ పరిస్థితులపై షా అఖిలపక్ష భేటీ నిర్వహించగా..18 పార్టీలు హాజరయ్యాయి. ఈ భేటీలో మణిపుర్లో శాంతి పునరుద్ధరణ కోసం అన్ని పార్టీలూ సలహాలు, సూచనలందించాయి. షా మాట్లాడుతూ.. అక్కడ పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయన్నారు.