బీజేపీ నేత, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గత ఐదు నెలలుగా నిర్విరామంగా చేపడుతున్న ఈ ఆందోళనను రెజర్లు విరమించారు. కోర్టులోనే తేల్చుకుంటామని రెజ్లర్ సాక్షిమాలిక్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై చార్జ్ షీట్ దాఖలు చేయడంతోనే ఆందోళనను విరమించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు.