గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెద్దపాలెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో అచ్చమ్మ చెరువు పంట కాలువ, పులక కాలువ లో పూడికతీత గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టారు. పంట కాలువల్లో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు తొలగించారు. కూలీల కొలతలు మస్టర్లను ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ పర్యవేక్షించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజులు ఉపాధి హామీ పనులు కల్పిస్తామని ఆయన తెలిపారు.