నంద్యాల జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన పలువురు పాణ్యం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆదివారం తన నివాసంలో పది కుటుంబాల సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు విసుగుచెంది టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని అన్నారు. టీడీపీలో చేరిన వారిలో కురువ మురళి, పద్మ, అనంతయ్య, రాము, ఈశ్వరయ్య, రాజు ఉన్నారు.