ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి కోవై పర్యటనలో మహిళా డ్రైవర్ బస్సు లో ప్రయాణించారు. ఈ క్రమంలో బస్సు కండక్టర్ టికెట్ ఇవ్వడాన్ని మహిళా డ్రైవర్ తప్పుబట్టగా.. ఆమెను ట్రెవెల్స్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కమల్ హాసన్.. ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్‌కు ఓ కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మహిళా డ్రైవర్ ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని కమల్ ఆకాంక్షించారు.