అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ముందుగా విధించిన గడువు ఈ నెల 26తో ముగియాల్సి ఉందని, జూలై 11 వరకు గడువును పొడిగించినట్లు ఈపీఎఫ్వో తెలిపింది. ఈపీఎఫ్ఓ తన పరిధిలోకి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు అధిక పెన్షన్ ఎంపికను తీసుకొచ్చింది. తాజా పొడిగింపుతో ఇప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం లభించింది.