కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సఫలీకృతం అయ్యాయి. ఈ క్రమంలో మరో 5 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నేడు పట్టాలెక్కనున్నాయి. మంగళవారం ఉదయం 10: 30 గంటలకు ఏకకాలంలో 5 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి ఈ ఐదు కొత్త రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.