అచ్చుతాపురం: భోపాల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేరా బూత్ సబసే మజబ్బూత్ (నా పోలింగ్ బూత్ అన్నింటికన్నా చాలా శక్తివంతమైంది. శిక్షణ కార్యక్రమానికి యర్రవరానికి చెందిన భాజపా రాష్ట్ర సైనిక సెల్ కో-కన్వీనర్ అగ్గాల హనుమంతరావు ఎంపికయ్యారు. ఈసమావేశానికి ఏపీ నుంచి 70 మంది ఎంపి కకాగా వీరిలో ఈయన ఒకరు. ఈనెల 27న భోపాల్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో వీరు సమావేశమవుతారు. త్వరలో జరిగే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ తరపున బూతాయిలో పనిచేయడానికి, మిగిలిన నాయకులకు అవగాహన కల్పించడానికి వీరిని ఉపయోగించనున్నారు.