రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ బీద రవిచంద్ర నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ తన హయంలో నెల్లూరు నగరంలో 4500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలపై పూర్తిస్థాయిలో విసిగి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు.