తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదంటూ గత కొన్ని రోజుల నుండి ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి తూర్పు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా 14వ వార్డులోని కబాడీ గూడెం పీకల వాగు ప్రాంతంలో పర్యటించన ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫాకు స్థానిక ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఎన్నో సంవత్సరాల నుంచి పీకల వాగు సమస్యను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేను, మున్సిపల్ అధికారులను సంప్రదించినా ఎవరు పట్టించుకోవడం లేదంటూ సామాజిక కార్యకర్త అబ్దుల్ కలాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే, ఎంపీ ముందే పీకల వాగు మురికి కాలువలో అబ్దుల్ కలాం దిగి తన నిరసనను వ్యక్తం చేశారు.