స్పందనపై, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తిరుపతి కమిషనర్ హరిత హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ కిషోర్ బాబు, అమినిటీస్ సెక్రటరీ కె. ఆనంద్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.