ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, చాట్రాయి మండలంలోని నాలుగు ఆలయాల్లో సోమవారం రాత్రి దొంగలు హుండీల చోరీకి పాల్పడ్డారు. ఆరుగొలనుపేట, జనార్దనవరం గ్రామాల్లో రామాలయాలు, తుమ్మగూడెంలో రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను దొంగలు పగలకొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఎస్సై ప్రతాపరెడ్డి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు.