శ్రీకాకుళం నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని టీడీపీ గార మండల నాయకులు తెలిపారు. మంగళవారం కుమ్మరిపేటలో పార్టీ నాయకుడు జల్లు రాజీవ్ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీకి అధిష్టానం మేరకు అభ్యర్థి విజయానికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రిను చేసేందుకు నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషిచేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు ఎల్.రాధాకృష్ణరెడ్డి, ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి పార్టీ నాయకులు మళ్ళ నరసింగరావు, వి.శ్రీను, ఎన్ని గోపి పాల్గొన్నారు.