వరుసగా నాల్గవ ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎం వైయస్ జగన్కు డిప్యూటీ సీఎం రాజన్నదొర, స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు.ముఖ్యమంత్రిని చూసి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సభా ప్రాంగణానికి బయల్దేరారు.