ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విశాఖ పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. కశింకోట కు చెందిన యాదగిరి గోవింద్ 2017ఆగస్ట్ 22వ తేదీకి ముందు అదె గ్రామానికి చెందిన యువతిని మాయమాటలతో మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లో భరుచుకుని మోసం చేశాడు. యువతి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు