దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ కార్యాలయాల నుంచి యూపీఐ డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని రకాల అభివృద్ధి, రెవెన్యూ వసూళ్లను వీటి ద్వారా చేపట్టబోతున్నామని తెలిపింది. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. దాదాపు 98శాతం పంచాయతీలు ఇప్పటికే సేవల్ని ప్రారంభించాయని..ఫోన్‌పే, గూగుల్‌పే, భీమ్ వంటి వాటి ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తెలిపింది.