శుక్రవారం చైతన్య రథయాత్రను విజయవంతం చేయడానికి పెదకూరపాడు మండలం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. పార్టీ కార్యకర్తలు నాయకులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్తిమల్ల రమేష్ ఆధ్వర్యంలో బయలుదేరారు. మండలంలోని 20 గ్రామాల నుండి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు ద్విచక్ర వాహనాల ద్వారా బార్లు తీరారు. పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొంటారు.