గుజరాత్ లోని మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో ఉన్న వీధి కుక్కలకు రూ. 90 కోట్ల విలువైన ఆస్తి ఉంది. గ్రామంలోని వీధికుక్కల బాగోగుల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయగా, కొంతమంది తమ భూమిని ఈ ట్రస్ట్ కు రాసిచ్చారు. ప్రస్తుతం ఈ శునకాల పేరిట పదెకరాల భూమి ఉండగా, దీని విలువ రూ. 90 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూములను గ్రామంలోని రైతులకే కౌలుకు ఇచ్చి, వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కుక్కల పోషణకు వినియోగిస్తున్నారు.