పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911.15 కోట్లు విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రి మండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయడమే లక్ష్యంగా అధికారులు సోమవారం భేటీ కానున్నారు. ఢిల్లీలోని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. ఇందులో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్ సింగ్ వోరా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ శివ్‌నందన్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.