పెందుర్తి నియోజక వర్గ పరిధిలోని ఫార్మా సిటీ అర్జన్ కంపెనీ లో కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొదటి ప్రాధాన్యత గా ఉద్యోగాలు ఇచ్చి పర్మినెంట్ చేస్తామని చెప్పి గత 6సంవత్సరాలుగా పని చేయించుకుని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు మాట మారుస్తూ కార్మికులను కంపెనీ నుంచి తొలగించడంతో కార్మికులు ధర్నా చేస్తున్నారు. సంఘటనా స్థలంలో కాస్త ఉదిక్రత నెలకొంది.