నిండు గర్భిణి మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీని డెలివరీ నిమిత్తం ఏలూరు నుంచి విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రికి తరలచారు. అయితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో బిడ్డ మృతి చెందింది. ఈరోజు ఉదయం తల్లి కూడా మృతి చెందిందని, ఏలూరు తీసుకువెళ్లిపొండి అంటూ వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.