చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడలన్నా భయపడేవారన్నారు. కానీ, ఇప్పుడున్న సీఎం జగన్ తన కళ్లముందే మహిళలను అవమానిస్తున్నా చర్యలు తీసుకోకపోగా, కనీసం వారించడం లేదు. ‘‘అసెంబ్లీ సాక్షిగా నా తల్లికి అవమానం జరిగింది. ఆమె ఏ తప్పూ చేయలేదు. కానీ, అసెంబ్లీలో ఆమెను అవమానిస్తున్నా.. ఈ సీఎం చూస్తూ కూర్చున్నాడు తప్ప కనీసం వారించలేదు. ఇలాంటి నాయకుల కారణంగానే రాష్ట్రంలో మహిళల పట్ల దారుణాలు జరుగుతున్నాయి. మా అక్కను వేధించవద్దు అన్నందుకు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని నిలువునా తగలబెట్టేశారు. సమస్యలు ప్రస్తావించినందుకు శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే మహిళ దుకాణం కొల్లగొట్టారు. ఈ సీఎంను, ఎమ్మెల్యేలను చూసి వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి అరాచక శక్తులకు త్వరలోనే కఠిన శిక్ష తప్పదు’’ అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ హెచ్చరించారు. మహిళలకు గౌరవించడం తెలుగుదేశం సిద్ధాంతమని, మహిళాభివృద్ధి చంద్రబాబు నినాదమని లోకేశ్ అన్నారు.