తాడిపత్రి పట్టణంలో సిఐగా విధులు నిర్వహిస్తూన్న చంద్రగిరి మండలం, కల్ రోడ్డు పల్లెకు చెందిన ఆనందరావు మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మంగళవారం సిఐ ఆనందరావు పార్థివదేహాకి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామంలో అందరికి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయసహకారాలు అందించేవాడని అన్నారు.