ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. కమర్షియల్ ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను అదనంగా రూ.7 వరకు పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల ఎల్ పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. ఈ క్రమంలో దుకాణదారులు, హోటల్ యజమానులపై భారం పడనుంది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి.