కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్ గాంధీపై వారంటు జారీ చేయడం వంటి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరు, బీజేపీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్లను విచారించిన జార్ఖండ్ హైకోర్టు ఈ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 16వ తేదీకి వాయిదా వేసింది.