కొన్ని పెళ్లిళ్లు పీటాలమీదే ఆగిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇదిలావుంటే అక్కడ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కుమారుడు వచ్చి మండపంలో కూర్చున్నాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ పెళ్లి జరుగుతోందన్న ఆనందంలో మునిగి తేలుతున్నారు. పెళ్లి కుమార్తెను మండపానికి తీసుకురమ్మని.. పంతులు సూచించాడు. దీంతో వధువును ఆమె కుటుంబ సభ్యులు ధూమ్ ధామ్‌గా సందడి చేసుకుంటూ మండపానికి తీసుకువస్తున్నారు. వధువు వెంట ఆమె తల్లి కూడా వచ్చింది. ఈ క్రమంలోనే వధువుతో వచ్చే వారు మేళ తాళాలు, డ్యాన్స్‌లతో ఆమెను పెళ్లి మండపం వైపు తీసుకువస్తున్నారు. అదే సమయంలో పెళ్లి కుమార్తె తల్లి.. చేతిలో సిగరెట్ పట్టుకుని కాల్చుకుంటూ చిందులు వేసింది. అది చూసిన వరుడు షాక్ అయ్యాడు. దీంతో పెళ్లి పెటాకులు చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్‌పురకు చెందిన వధువుకు.. జూన్ 27న వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపానికి వధువు, వరుని బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారు. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ పూర్త్యయాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో వరుడు పెళ్లి పీటలపై కూర్చున్నాడు. అదే సమయంలో పెళ్లి కుమార్తెను కూడా తీసుకురావాలని పురోహితుడు సూచించాడు. దీంతో వధువు తరపున బంధువులు ఊరేగింపుగా వచ్చారు. వధువు పల్లకి ముందు ఆమె తల్లి సిగరెట్ కాలుస్తూ.. డ్యాన్సులు చేస్తూ ఉంది. వధువు కోసం పీటల మీద వేచి ఉన్న వరుడు అత్త సిగరెట్ కాలుస్తూ.. డ్యాన్స్ చేయడం చూసి షాక్‌కు గురయ్యాడు. దీంతో కోపంతో తనకు ఆ పెళ్లి వద్దని మండపం నుంచి వెళ్లిపోయాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు.
పెళ్లి అర్ధాంతరంగా పీటల మీద ఆగిపోవడంతో అక్కడ ఉన్నవారు, బంధువులు.. వరునికి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వరుడు పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అన్నాడు. దీంతో పంచాయితీ పెద్దలు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి.. జరిగిన సమస్యను పరిష్కరించే ఏర్పాట్లు చేశారు. పెళ్లి కుమారుడికి పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో చివరికి పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పెళ్లి తంతు యధావిధిగా జరిగింది.