కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. మోదీ ఇంటిపేరు కేసు విచారణలో భాగంగా రాంచీ కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు మినహాయింపునిచ్చింది. రాహుల్ గాంధీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. పరువు నష్టం కేసులో తనను వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ రాంచీ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పును రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు.