ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఏడుగురు తోబుట్టువులు. అందులో పెద్ద సోదరి శశి పాయల్ ఓ చిన్నగ్రామంలో టీ షాపును నడిపిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్ టీ స్టాల్ ఉంది. ఆమె కొఠార్ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే సీఎం సోదరి అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడపడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.