‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ యాత్రకు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కేఎస్ జవహర్తోపాటు పలు వురు టీడీపీ ప్రముఖులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు స్వగృహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మరిడమ్మ దేవస్థానానికి చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్ర మం నిర్వహిస్తారు. అక్కడ నుంచి పెద్దాపురం మున్సిపల్ సెంటర్, మెయిన్ రోడ్డు, సినిమా సెంటర్, నుంచి వాలుతిమ్మాపురం టిడ్కో గృహాలు పరిశీలన అనంతరం బైపాస్ మీదుగా కొత్తపేట, దర్గాసెం టర్ చేరుకుంటారు. అక్కడ నుంచి గుడివాడ, సిరివాడ, కాండ్రకోట, మర్లావ, తిరుపతి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, గోరింట, వడ్ల మూరు, జి.రాగంపేట మీదుగా సామర్లకోట బ్రౌన్పేటకు చేరుకుం టారు. అక్కడ నుంచి గాందీ బొమ్మ సెంటర్, క్లాక్ సెంటర్, మఠం సెంటర్ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అనంతరం సాయం త్రం ఆరు గంటలకు సామర్లకోట పూర్ణా కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తారని కాకినాడ పార్లమెంటరీ తెలుగు రైతు కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు విలేకరులకు తెలిపారు.