తోపుదుర్తి కుటుంబానికి ధర్మం తప్ప అధర్మం తెలియదని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వాళ్ల జీవితం కాలంలో మోకాళ్ల మీద తపస్సు చేసినా, తల కింద పెట్టి కాళ్లు పైకి పెట్టినా చేయలేనన్ని మంచి పనులు ఈ నాలుగేళ్లలో మేము చేశామన్నారు. తోపుదుర్తి కుటుంబానికి ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. మాకు చెడు చేసిన వాళ్లకు కూడా మంచి చేసే మనస్తత్వం మాది అన్నారు. ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. ఆత్మకూరు మండలం సనప గ్రామంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి ఎంఎల్ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సర్టిఫికెట్లను ప్రజలకు అందజేశారు.