ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ ఉన్నారు. సుప్రీంకోర్టుకు 34 మంది న్యాయమూర్తులు మంజూరవ్వగా, ప్రస్తుతం 31 మంది ఉన్నారని, తెలంగాణ, కేరళ ప్రధాన న్యాయమూర్తులకు అన్ని అర్హతలు ఉన్నందున ఏకగ్రీవంగా సిఫార్సు చేశామని సుప్రీంకోర్టు పేర్కొంది.