ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ పిల్లలకు ప్రత్యేక కిట్లు అందించాలని నిర్ణయించింది. 3 నుండి ఆరేళ్ల పిల్లలకు ఒక పలక, 12 రంగుల స్కెచ్ పెన్సిళ్లు, రెండు పెన్సిళ్లు, ఒక ఎరేజర్, షార్ప్ నర్ తో కూడిన కిట్లను పంపిణీ చేయనుంది. ఈ కిట్లను ఈ నెలాఖరులోగా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంగన్ వాడీల్లో చదివే 8.50 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది.