పాకిస్థాన్, ఇండోనేషియా దేశాలను శుక్రవారం భూకంపం వణికించింది. ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపం తనింబర్ దీవులకు వాయువ్యంగా 207 కిలోమీటర్ల దూరంలోని సముద్రగర్భంలో సంభవించింది. కాగా పాకిస్థాన్లో సైతం శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.