రాజధాని అమరావతి ఆర్ -5 జోన్ లో పేద దళిత రైతులకు జరుగుతున్న అన్యాయంపై శనివారం అమరావతి ప్రాంతంలో పాదయాత్ర జరగనున్నట్లు మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుళ్లూరు అంబేద్కర్ విగ్రహం నుండి శాఖమూరు అంబేద్కర్ స్మృతివనం వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని తెలిపారు.