నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రట్ రాజీనామా చేశారు. దాంతో ఆ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోని వలసల నిరోధంపై కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ప్రధాని మార్క్ రట్ తన పదవి నుంచి తప్పుకున్నారు. తనతోపాటు మంత్రిమండలి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్‌కు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa