HDFC బ్యాంకు మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై 15 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 8.10% కు చేరింది. నెల రోజుల రుణాలపై 10 బేసిస్ పాయింట్లు పెరగడంతో వడ్డీ రేటు 8.30% చేరింది. మూడు నెలల రుణాలకు 8.6%, ఆరు నెలల రుణాలకు 8.9%, ఏడాది రుణాలకు 9.05 శాతంగా ఉంది.