పొన్నూరు పట్టణంలో శ్రీ సాక్షి భన్నానారాయణ స్వామి భూములు 9 ఎకరాలు కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య తన భార్యను ట్రస్టు బోర్డు నెంబర్ గా పెట్టడం నిజం కాదా! అని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. శనివారం తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాక్షాధారాలతో నిరూపిస్తానని నా ఆరోపణలు అసత్యాలైతే నాపై కేసు పెట్టుకోవచ్చని ఎమ్మెల్యే కిలారి కు ధూళిపాళ్ల చాలెంజ్ విసిరారు.