జమ్ముకశ్మీర్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో ఆదివారం మధ్యాహ్నం యాత్ర పునఃప్రారంభించారు. అయితే, కేవలం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్ర మొదలైంది. బల్తాల్ మార్గంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడక యాత్రను ఇంకా ప్రారంభించలేదు. గత శుక్రవారం నుంచి 3 రోజులుగా యాత్ర నిలిచిపోయింది.