అమ్మ ఒడి డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కాకపోవడంతో తల్లులు అయోమయ పరిస్థితిలకు గురౌతున్నారు. పిల్లలను బడికి పంపించే తల్లుల ఆర్థిక తోడ్పాటుకు అమ్మ ఒడి పథకాన్ని రూపొందించామని చెబుతున్న సీఎం బటన్ నొక్కి 10 రోజులు కావస్తున్నా తల్లుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ కాలేదని విద్యార్థులు తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.