పెదనందిపాడు మండలం వరగాని గ్రామం పొలాల్లో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్న శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద 5200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెదనందిపాడు ఎస్సై అబ్దుల్ రెహమాన్ సోమవారం ఉదయం మీడియాకు తెలిపారు. త్వరలో వీరిని కోర్టుకు హాజరు పరుస్తామని ఆయన పేర్కొన్నారు.