జగనన్న సురక్ష క్యాంపు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 11 రకాల ఉచిత సర్టిఫికెట్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఫిరంగిపురం మండలం, బేతపూడి గ్రామంలో జరుగుతున్న జగనన్న సురక్ష క్యాంపు ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.